Friday, February 11, 2011

రామరాజ్యం ఎలా ఉండాలి?

     నేడు కలి ప్రభావమున ధర్మ చింతన సడలిపోతున్నది. కలియుగమున భగవంతుని, గురువులను ఆశ్రయించిన వారికి మాత్రము ఈ కలి బారినుండి రక్షణ లభిస్తున్నది. మన సమాజములో ధర్మమును రక్షించు వారుకూడా కరువైనారు. గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు అని పలికే వారూ నేడు లేరు. గోవులు బ్రాహ్మణులు ఎందుకు రక్షింప బడాలి? అని ఎదురు ప్రశ్నించేవారు కో కొల్లలు. ఇటువంటి తరుణంలో భగవత్ భక్తులకు, గుణముచేత బ్రాహ్మణులైన వారికి, గోవులకు రక్షణ కరువైనది. మన భారతీయ సంస్కృతి వ్యాపించాలంటే వేద సారమును గ్రహించిన బ్రాహ్మణులు కాపాడ బడాలి. వారిని గురువులుగా గుర్తించి వారి వాక్యాలను ఆచరణలో పెట్టాలి. దానికి పురాణములు ఆదర్శంగా నిలుస్తాయి.  వాటిని వ్యాప్తి చేయడానికి సంస్కృతం అందరికీ వచ్చి ఉండాలి. కనుక మన రామరాజ్యంలోని వ్యాసాలు ఈ క్రింది విధంగా ఉండాలని మా ఆశయం.

౧. భారతీయ ధర్మములపై నమ్మకము కలిగిన వారితో స్నేహం ప్రోత్సహింప చేయడం.
౨. ప్రతీ ఒక్కరిలో భక్తి భావం పెంపొందింప చేయడం.
౩. భగవద్భక్తులకు, గోవులకు, గుణముచేత బ్రాహ్మణులకు తగిన రక్షణ కల్పించడం.
౪. భారతీయ జీవన విధానమునకు తగిన విద్యా సంస్థలను నెలకొల్పేవిధంగా ప్రోత్సహించడం.
౫. సంస్కృత భాషా వ్యాప్తికి తగిన ప్రోత్సాహమందించడం.
౬. పోరాటపటిమను, సాహసాన్ని పాఠకులలో పాదుకొల్పి ధర్మ రక్షణకు ప్రోత్సహించడం.

Monday, January 31, 2011

రామరాజ్యమునకు స్వాగతం

రామో విగ్రహ వాన్ ధర్మః అన్నది పెద్దల వాక్యం. అటువంటి ధర్మ బద్ధమైన భారతీయ జీవనం ప్రజలు జీవించి చూపిననాడు అది మరల ఓ రామరాజ్యమౌతుంది. ఆదిశగా నలుగురినీ ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభించ బడినదే ఈ బ్లాగు.భరతుడు రాముని పాదుకలను సింహసనముపై ఉంచి రాముని పేర రాజ్యపాలన చేసినట్లుగా ఆరాముని పేరుతో మనమూ ఓ నవసమాజ నిర్మాణమునకు అడుగులు వేద్దాము. భగవంతుడైన ఆరాముడే ఆదర్శుడు. అతని చరితమే మార్గదర్శకము. వేదము శిరోధార్యము. భారతీయ జీవన విధానమే కర్తవ్యము. అటువంటి సమాజనిర్మాణమునకై చేయు చర్చలకు వేదికగా ఈ రామరాజ్యం నిలుస్తుంది అని ఆశిస్తున్నాను. మీ ఆశీస్సులే శ్రీరామ రక్ష.